విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

MDK: చేగుంట మండలం మక్కరాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంగళవారం ఎగ్జామినేషన్ కిట్టు పంపిణీ చేశారు. జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ కానిస్టేబుల్ బాలిశెట్టి రాజా గౌడ్ విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేశారు. శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.