'కిసాన్ కపాస్ యాప్ రైతుల పాలిట శాపంగా మారింది'
ADB: కిసాన్ కపాస్ యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అదిలాబాద్ రూరల్ మండల్ పోచ్చర గ్రామంలోని కౌలు రైతు ఎగిడే సురేష్ పత్తి పంట ప్రమాదవశాత్తు నిప్పంటుకొని కాలిపోయింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న రైతు కుటుంబాన్ని ఇవాళ పరామర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేమ నిబంధనలు తొలగించాలని కోరారు.