VIDEO: తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
గుంటూరు అమరావతి రోడ్డులో మాదిగ భవన్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాదిగ జాతి యువకులు ఉన్నత విద్య, ఉద్యోగాలు, పదవులు సాధించడానికి ఒక వేదికగా ఈ మాదిగ భవన్ నిలుస్తుందని పేర్కొన్నారు. “మాదిగ భవన్ మనందరి భవన్” అని అన్నారు.