VIDEO: స్పీకర్ జీతంతో ప్యాచ్ వర్క్ చేయించాలని నిరసన
వికారాబాద్ పట్టణంలోని రోడ్ల దుస్థితిపై నాసన్ పల్లి యాదయ్య అనే యువకుడు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపాడు. కొత్తగడి నుంచి మోత్కుపల్లి వరకు రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి వాహనదారులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఆ స్థానం నుంచి ఒక నెల జీతం తీసుకోకుండా, ఆ డబ్బుతోనైనా తమ ప్రాంతంలో రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేయించాలని కోరారు.