దివ్యాంగులకు స్కూటీలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
MBNR: దివ్యాంగుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ మహబూబ్‌నగర్‌లోని 16 మంది దివ్యాంగులకు ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. దివ్యాంగుల జీవన ప్రమాణాల మెరుగుదలకు, విద్యా, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఉన్నారు.