VIDEO: పశుగ్రాసం లేక రైతులు ఇబ్బందులు

కోనసీమ: కె.గంగవరం మండలం కోటిపల్లి గోదావరి వద్ద వరద ప్రవాహం పెరుగుతుంది. ఈ సందర్బంగా కోటిపల్లి లంక వరద దిగ్బంధంలో ఉంది. వరద తీవ్రత దృష్ట్యా పాడి రైతులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పశుగ్రాసం అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పశువులకు పశుగ్రాసం, దాణాను అందజేయాలని కోరుతున్నారు.