500 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థుల భారీ ర్యాలీ

ప్రకాశం: మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, దీక్ష యూత్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి దోర్నాల సెంటర్ వరకు నిర్వహించారు. 500 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంతోమంది మహనీయుల త్యాగఫలమే మనకు స్వతంత్య్రం అని తెలిపారు.