VIDEO: ఎర్రవల్లిలో జిల్లా కలెక్టర్ పర్యటన

GDWL: జిల్లా కలెక్టర్ సంతోష్ బుదవారం ఎర్రవల్లి మండలంలో పర్యటించారు. బీచుపల్లి నది పరివాహ ప్రాంతాన్ని పరిశీలించారు. ఏక్తాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఎర్రవల్లి చౌరస్తాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నాణ్యత, స్టాక్, ధరలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.