పొదిలిలో పద్మశ్రీ ఘంటసాల జయంతి వేడుకలు

పొదిలిలో పద్మశ్రీ ఘంటసాల జయంతి వేడుకలు

ప్రకాశం: పొదిలి త్యాగరాజ కళాక్షేత్రంలో గురువారం ఘంటసాల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైతన్య కళా స్రవంతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థుల కోసం పాటల పోటీ ఏర్పాటు చేయగా, చిన్నారులు ఘంటసాల పాటలను ఆలాపించారు. పోటీల్లో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.