'ఎవరైన లంచం అడిగితే మాకు తెలియజేయండి'
SKLM: జిల్లాలో గత 5 ఏళ్లలో లంచం తీసుకున్న 47 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కరరావు తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు జైలుకు వెళ్లగా, మరికొందరు కోర్టు విచారణను ఎదుర్కొంటున్నారని చెప్పారు. లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.