'కమిషనర్ చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు'

ప్రకాశం: పొదిలి పట్టణంలోని సాయిబాబా దేవాలయం నందు మంగళవారం నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ దంపతులు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ దంపతులను పూలమాలవేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.