అభయ కృష్ణ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

అభయ కృష్ణ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

PDPL: ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీ అభయ కృష్ణ ఆలయంలో శనివారం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.