రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలం పెద్ద నాగారం స్టేజి శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.బైక్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచాం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.