విజయనగరంలో టెర్రర్ లింక్స్ కేసు విచారణలో పోలీసుల జోరు

విజయనగరంలో టెర్రర్ లింక్స్ కేసు విచారణలో పోలీసుల జోరు

VZM: విజయనగరంలో టెర్రర్ లింక్స్ కేసు విచారణలో పోలీసులు జోరు పెంచారు. నిందితులు సిరాజ్, సమీర్ కస్టడీ కోసం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరిని కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రధాన సూత్రధారుల గుర్తింపుపై పోలీసులు దూకుడు పెంచారు.