దివ్యాంగుల దరఖాస్తుల పరిశీలన
జగిత్యాల కలెక్టరేట్‌లో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సహాయ ఉపకరణాల దరఖాస్తుల పరిశీలన నిర్వహించారు. 2025-26కి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లు, హైబ్రిడ్ వీల్‌చైర్స్ కోసం దరఖాస్తు చేసిన బధిర, అంధ, భౌతిక దివ్యాంగుల ధృవపత్రాలను అధికారులు పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్. లత అధ్యక్షతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.