వేముల ఎంపీడీవోగా గంగాదేవి బాధ్యతల స్వీకరణ

KDP: వేముల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా గంగాదేవి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పులివెందుల ఎంపీడీవో కృష్ణమూర్తి ఇంఛార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు నిర్వహించేవారు. చెన్నూరు మండలంలో ఏవోగా పనిచేస్తున్న గంగాదేవి పదోన్నతిపై వేముల ఎంపీడీవోగా బదిలీపై వచ్చారు. ఎంపీడీవో గంగాదేవి మాట్లాడుతూ.. మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.