ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త..!
WGL: ఉమ్మడి WGL జిల్లాలోని నిరుద్యోగ యువతకు SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టూవీలర్ మెకానిక్, సీసీటీవీ టెక్నీషియన్, ఎల్‌ఎంవీ డ్రైవింగ్ కోర్సులు 30 రోజుల పాటు నిర్వహించబడతాయి. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజనం సౌకర్యం కల్పించనున్నారు.