VIDEO: బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి
ATP: రాయదుర్గం మండలం టీ.వీరాపురం ఫారెస్టు ఏరియాలోని కణేకల్లు రోడ్డులో బస్సు చక్రాల కిందపడి ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. గురువారం సాయంత్రం ఈశ్వర్ రాయదుర్గం నుంచి వీరాపురం వెళ్తుండగా బస్సును ఓవర్‌టేక్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.