జహీరాబాద్‌లో మహిళ అదృశ్యం
SRD: జహీరాబాద్ దత్తగిరి కాలనీకి చెందిన వనుము నాగారాణి (21) అనే యువతి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15న రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిన ఆమె, ఇప్పటివరకు తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జహీరాబాద్ టౌన్ ఎస్సై వినయ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.