నేడు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలు
కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇవాళ్టి పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాజోలు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు గుడిమెళ్ళంక, రామరాజులంక గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.