VIDEO: భద్రాద్రికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

VIDEO: భద్రాద్రికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

BDK: ఎగువ నుంచి వచ్చే వరదలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 10:05 గంటలకు 48 అడుగులు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగులు దాటితే మూడవ(చివరి) ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.