రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు
NGKL: మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ రైతులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నెల్లికొండ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. తూకం వేసిన ధాన్యాన్ని తరలించాలని మూడు రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నానని, తూకం ధాన్యానికి రైతు నుంచి వేలిముద్ర వేయించుకోకుండా కాపలాగా ఉంచడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.