'ప్రభుత్వ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి'
SKLM: ప్రభుత్వ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. జిల్లాలో లక్షా 60 వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం రాత్రి స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో మత్స్యకారు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మత్స్య శాఖ స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు.