ఉద్యోగం పేరుతో మోసం.. 11 లక్షలు స్వాహా..!
కర్నూలు జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.11.13 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అయితే వెంకటరమణ కాలనీకి చెందిన లోకేష్ అనే వ్యక్తికి హైదరాబాద్ లో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ప్రోగ్రామర్ గా పని చేస్తున్న ఈదర వెంకట రమేష్ అనే వ్యక్తి పలు టీవీ ఛానళ్లలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశారు. దీంతో బాధితుడు ఎస్పీ విక్రాంత్ పటిల్ కు ఫిర్యాదు చేశారు.