విద్యార్థుల ఆవిష్కరణ.. శబ్దంతో మంటలకు చెక్!
హిమాచల్ ప్రదేశ్‌లోని సుందర్‌నగర్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు నీరు, రసాయనాలు అవసరం లేని ‘సోనిక్ వేవ్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్’ను ఆవిష్కరించారు. ఇది 30–60 Hz తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలతో ఆక్సిజన్‌ను నియంత్రించి మంటలను ఆర్పుతుంది. సర్వర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎటువంటి నష్టం జరగకుండా మంటలు ఆర్పేందుకు ఇది అద్భుతమైన మార్గం.