నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
VZM: మెంటాడ మండలం ఆండ్ర 11KV ఫీడర్లో ఫీడర్ బైఫ్రికేషన్ పనులలో భాగంగా కొత్తగా పోల్స్, లైన్లు వేసే నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు DE బి.రఘు శనివారం తెలిపారు. ఈ మేరకు చల్లపేట, మెంటాడ, బడెవలస, జక్కువ, అమరాయివలస, జయతి, కొండలింగావలస, ఆగూరు, గుర్ల ఆండ్ర గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలన్నారు.