రేపు జిల్లాకు వర్ష సూచన

రేపు జిల్లాకు వర్ష సూచన

ATP: ద్రోణి ప్రభావంతో రేపు అనంతపురం జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని సూచించారు. రైతులు, గొర్రెల కాపరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని కోరారు.