పేద కుటుంబానికి పుస్తె మెట్టెలు అందజేత

SRD: హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన ఎరుకలి స్వరూప కుమార్ దంపతుల కూతురి వివాహానికి పుస్తె మెట్టలు ఏవిఆర్ ఫౌండేషన్ వారు అందజేశారు. దీని వ్యవస్థాపకులు అందోల్ యాదయ్య సమక్షంలో అందోల్ రాములు, చాకలి భాగయ్య, బక్క భూమయ్య, ఆందోల్ ఆశయ చేతుల మీదుగా పుస్తె మెట్టలను అందజేశారు. నిరుపేద కుటుంబానికి ఏవిఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.