వారణాసి: రిలీజైన 'రాణా కుంభ' సాంగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న చిత్రం 'వారణాసి'. ఈ చిత్రం నుంచి ఒక పాటను తాజాగా విడుదల చేశారు. 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌లో స్టేజిపై ఆలపించిన 'రాణా కుంభ' అనే ఈ పాటను యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ పాటకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, చైతన్య ప్రసాద్ ఆలపించారు.