ప్రకృతికి నచ్చేలా గణపతి మెచ్చేలా..

NTR: వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి చెక్.. ఈసారి మట్టి ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జీ.లక్ష్మీశ తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బహుమతిగా అందించాలంటే ప్రతి దాంట్లో పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని వివరించారు.