ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు

NRML: ముధోల్ వద్ద బుధవారం అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. అబ్దుల్లాపూర్‌కు వరి నాట్లు వేయడానికి కూలీలను తీసుకెళుతున్న ఆటో రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.