శనగ రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతి
ATP: జిల్లాలోని శనగ రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దామోదర్ కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు పండించిన శనగలను శీతల గిడ్డంగిలో నిల్వ ఉంచారని, ప్రస్తుతం మార్క్‌ఫెడ్ పాత నిల్వలను కొనుగోలు చేయడం లేదని అన్నారు. తెల్ల శనగలను కూడా మద్దతు ధరకు సేకరించి రైతులను ఆదుకోవాలని కోరారు.