పెద్దాపురం మున్సిపాలిటీ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష
కాకినాడ: పెద్దాపురం మున్సిపాలిటీ అభివృద్ధిపై శాసనసభ్యులు నిమ్మకాయల చిన రాజప్ప సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, నాణ్యతతో కూడిన పనులు చేపట్టేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మాజీ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.