పిచికారీ మందు నీరు తాగి ఆవు మృతి
MLG: కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో విషాద ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జనగాం నాగయ్యకు చెందిన పాడి ఆవు, సమీప రైతు చేను వద్ద డ్రమ్ములో నిల్వ ఉంచిన మిర్చి తోట పిచికారీ మందు కలిపిన నీటిని తాగడంతో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో తనకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు.