శుద్ధమైన తాగునీరు పంపిణీ చేయాలి: కమీషనర్

శుద్ధమైన తాగునీరు పంపిణీ చేయాలి: కమీషనర్

NTR: విజ‌య‌వాడ అర్బ‌న్ పాత రాజరాజేశ్వరి పేటలో బబుల్స్ ద్వారా శుద్ధమైన తాగునీరు పంపిణీ చేయాల‌ని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. గురువారం సాయంత్రం పాత రాజరాజేశ్వరిపేటలో పర్యటించి క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరా నాణ్యతను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి తాగునీటి సరఫరా ఎలా ఉంది, రంగు మారిన నీరు ఏమైనా వ‌స్తుందా? అని అడిగి తెలుసుకున్నారు.