'ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించండి'

కృష్ణా: యువత, మహిళలకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ అధికారుల ఎంఎస్ఎంఈ థీమ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆ స్టాల్‌ను ప్రారంభించి, స్టాల్ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలపై వారికి దిశా నిర్దేశం చేశారు.