మంచినీటి సమస్యను పరిష్కరించాలి

ASF: తిర్యాణి మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా శనివారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మండల ఎంపీడీఓ, ప్రత్యేక అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. వేసవి కాలం నేపధ్యంలో వివిధ గ్రామాల్లో నీటి సమస్య తలెత్తుతుందని అన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.