అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
E.G: అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ అన్నారు. మండలంలోని ములగపూడి గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించి మాట్లాడారు. రూ.13లక్ష0లతో నిర్మించిన పాఠశాల భవనాన్ని, రూ.2.4 కోట్ల నిధులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని, సీసీ రోడ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.