'బిసి బిల్లు పెండింగ్‌లో పెట్టడం బాధాకరం'
NRML: గత ఏడు నెలల క్రితం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి పంపిన బిల్లును పెండింగ్లో పెట్టడం చాలా బాధాకరమని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ యాటగారి సాయన్న ముదిరాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అర్బన్, రూరల్ తహసీల్దారులకు 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మెమోరాండంలు అందజేశారు.