'మురుగునీటి పారుదల సక్రమంగా నిర్వహించాలి'

'మురుగునీటి పారుదల సక్రమంగా నిర్వహించాలి'

MNCL: ప్రధానమంత్రి అజయ్ పథకంలో ఎంపికైన చెన్నూర్ మండలంలోని కత్తెరసాల గ్రామపంచాయతీ పరిధిలోని కత్తెరసాల, నర్సక్కపేట, పాగేపల్లి గ్రామాలలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య గురువారం పర్యటించారు. ఈ సందర్భం గ్రామాలలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించి కాలువల శుభ్రత, మురుగునీటి పారుదల వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని పంచాయతీ అధికారులకు సూచించారు.