'పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందించాల్సిందే'
NTR: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ బుధవారం ఆర్డీవోలు, తహశీల్దార్లకు మార్గదర్శకాలు జారీచేశారు. పారదర్శకంగా గడువులోగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని, విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. దరఖాస్తుదారులకు సరైన సమాచారం అందించి, సమస్య పరిష్కారమయ్యే వరకు నిబద్ధతతో సేవలందించాలని సూచించారు.