మడకశిర అభివృద్ధికి సహకారం: పట్టాభిరామ్‌

మడకశిర అభివృద్ధికి సహకారం: పట్టాభిరామ్‌

సత్యసాయి: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్‌ మడకశిర నియోజకవర్గానికి వచ్చారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో పట్టణ సమస్యలపై మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లతో కలిసి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మడకశిర మున్సిపాలిటీ అభివృద్ధికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.