VIDEO: ఘనంగా లక్ష్మీనరసింహుడి శాంతి కళ్యాణం

E.G: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం ద్వాదశి సందర్భంగా శాంతి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను పాత కళ్యాణ మండపంలో కొలువు దీర్చి అలంకారోత్సవం చేశారు. అనంతరం ఘనంగా కల్యాణం చేశారు. ఆలయ ఏసీ సత్యనారాయణ, అనేక మంది భక్తులు పాల్గొని కళ్యాణం తిలకించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.