తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకురాలుకు డాక్టరేట్

NZB: TUలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న గోల్డి బల్బీర్ కౌర్ డాక్టరేట్ సాధించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ ప్రొ.వి.శ్రీనివాస్ పర్యవేక్షణలో ‘ద ఇమేజ్ ఆఫ్ న్యూ వుమెన్ స్టడీ ఆఫ్ శోభాడే సెలక్ట్ నావెల్స్’అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు. వర్సిటీలో నేడు జరిగిన మౌఖీక పరీక్షకు ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా తిరుపతి కుమార్ ఆన్లైన్లో హాజరయ్యారు.