29 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

29 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

NZB: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు నిన్న సాయంత్రం పట్టుకున్నారు. నిజామాబాద్ నగర శివారులో దాదాపు 29 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ లారీని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిర్మల్ జిల్లా చించోలి మాజిద్ అనే రైస్ మిల్లు నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో పోలీసులు దాడి చేసి లారీని పట్టుకున్నారు.