'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం'

'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం'

KDP: పులివెందుల టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి 110 అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీటిలో ఎక్కువగా గృహ నిర్మాణ, రైతుల సమస్యలు ఉన్నాయని, ప్రతి అర్జీని బాధ్యతగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.