'భక్తులు ఎవరు జలపాతం వద్దకు రావద్దు'
ప్రకాశం: చంద్రశేఖరాపురంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు జలపాతం వృద్ధుతంగా ప్రవహిస్తుంది. ఈ మేరకు గురువారం ఆలయ ఈవో కృష్ణారావు పైనుంచి నీటి ప్రవాహంతో పాటు రాళ్లు పడే అవకాశం ఉందని అంటున్నారు. దీనికోసం ముందస్తు చర్యల్లో భాగంగా జలపాతం చుట్టూ కాంచన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, భక్తులెవరు జలపాతం వద్దకు రావద్దని సూచించారు.