VIDEO: టిడ్కో కాలనీలో మురుగునీటి సమస్య
కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీలోని సీ-46 బ్లాక్ నివాసితులు అపరిశుభ్రతతో నరకం చూస్తున్నారు. అక్కడి మ్యాన్‌హోల్స్ పొంగి మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని, నిల్వ ఉన్న నీటి వల్ల దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, అధికారులు సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.