సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ మరో ముందడుగు

సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ మరో ముందడుగు

పర్యావరణ రక్షణలో భారత సైన్యం మరో ముందడుగు వేసింది. లడఖ్‌లోని చుషుల్‌లో ఎన్‌టీపీసీతో కలిసి చేపట్టిన 'గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్' సోలార్ విభాగాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. 'చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2025' వేదికగా.. ఆర్మీ పర్యావరణ కార్యక్రమాలపై 'గ్రీన్ ఇనిషియేటివ్స్ 2.0' బుక్‌ను కూడా రిలీజ్ చేశారు.