రెండో రోజు 152 సర్పంచ్, 186 వార్డు నామినేషన్లు.!
MDK: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల స్వీకరణలో సర్పంచ్ స్థానాలకు 152, వార్డు సభ్యుల స్థానాలకు 186 నామినేషన్లు వచ్చాయి. అల్లదుర్గ్ 14, హవేలీఘనపూర్ 49, పాపన్నపేట్ 25, రేగోడు 18, శంకరంపేట్(ఏ) 17, టేక్మాల్ 29 సర్పంచ్ నామినేషన్లు స్వీకరించారు. ఈ వివరాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.